Saturday, July 26, 2025

Kerala Special Avial - Avial Recipe - Aviyal Recipe in Telugu - Telugu Recipes - Kerala Recipes - అవియల్‌ను వేడి అన్నంలోకి లేదా చపాతీ, పూరీ వంటి పిండి పదార్థాలతో సర్వ చేసుకోవచ్చు

 అవియల్‌ను తయారు చేయడానికి కావాల్సిన వంట పదార్థాలు ఇవే :



క్యారట్, బీన్స్, బంగాళాదుంప, అరటికాయ, చామదుంప, ముల్లంగి, బీట్రూట్ - 2 కప్పులు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 

శెనగపప్పు                                               - 2 

టేబుల్ స్పూన్లు మెంతులు                   - 1/2 

టీస్పూన్ ఆవాలు                                    - 1 

టీస్పూన్ కరివేపాకు                                - కొన్ని 

కొత్తిమీర - కొంచెం ఉప్పు                        - తగినంత 

కొబ్బరి తురుము                                      - 1 

కప్పు మజ్జిగ                                              - 1 కప్పు 

కొబ్బరి నూనె                                             - 2 

టేబుల్ స్పూన్లు కొత్తిమీర గింజలు          - 1 

టీస్పూన్ జీలకర్ర                                     - 1/2 

టీస్పూన్ పచ్చి మిర్చి                              - 3 

ఇంగువ                                                     - చిటికెడు 


అవియల్‌ను ఈ కింది విధంగా రెడీ చేసుకోవాలి :


ముందుగా అన్ని కూరగాయలను సన్నని ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ కూరగాయలన్నింటినీ ఒక బౌల్‌లో వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని కడగాలి. దీని వల్ల ఏదైనా చెత్త ఉంటే తొలగిపోతుంది

స్టవ్‌పైన ఒక గిన్నెను పెట్టి అందులో కట్ చేసిన కూరగాయలన్నింటినీ వేసుకొని తగినంత నీళ్లు పోసుకొని బాగా ఉడికించుకోవాలి. కూరగాయలు మెత్తగా అయ్యేంత వరకూ నీళ్లల్లో ఉడకబెట్టుకోవాలి. మిక్సీ జార్ కొత్తిమీర గింజలు, జీలకర్ర, పచ్చి మిర్చి, హింగు వేసి పేస్ట్‌లా నూరుకోవాలి. ఈ పేస్ట్‌ను ఉడికిన కూరగాయలలో కలపాలి. కూరగాయల పేస్ట్ లో మజ్జిగను పోసి బాగా కలపాలి. స్టవ్‌పైన ఇది బాగా మసిలిన తరువాత కిందకు దించేసుకోవాలి


ఒక చిన్న పాన్‌లో కొబ్బరి నూనె వేడి చేయాలి. ఇందులో ఆవాలు, శెనగపప్పు, మెంతులు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ తాలింపును కూరగాయ మజ్జిక మిక్స్‌లో కలుపుకోవాలి..


ఆవియల్‌ను కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఇక దీంతో అవియల్ రెడీ అయినట్టే. అన్నంతో, చపాతీతో ఈ అవియల్ చాలా బాగుంటుంది. కొంత మంది అవియల్‌ను అలాగే తింటుంటారు. 


చిట్కాలు: 

మీకు ఇష్టమైన కూరగాయలను ఈ వంటకంలో ఉపయోగించవచ్చు.కొబ్బరి నూనెకు బదులుగా సాధారణ నూనెను పోసుకోవచ్చు కానీ కొబ్బరి నూనెతో రుచి బాగా వస్తుంది.


అవియల్‌ను వేడి అన్నంలోకి లేదా చపాతీ, పూరీ వంటి పిండి పదార్థాలతో సర్వ చేసుకోవచ్చు. అవియల్‌ను సాంబారు పక్కన పెట్టి సర్వ్ చేస్తే రుచిగా ఉంటుంది. అలాగే, వడియాలు, పాపడాలు వంటి క్రంచీ ఐటమ్స్ తో కూడా మంచి కాంబినేషన్ అవుతుంది.



No comments: