Monday, July 28, 2025

Butter chicken Masala : రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్..ఇంట్లోనే సూపర్ టేస్టీగా ఎలా చేయాలో చూడండి

Chicken Makhani (Butter Chicken)


Butter chicken: రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్..ఇంట్లోనే సూపర్ టేస్టీగా ఎలా చేయాలో చూడండి





నాన్ వెజ్ లో చాలామంది ఇష్టపడే వంటకాలలో బటర్ చికెన్ ఒకటి. దీనిని ఎలా పడితే అలా చేస్తే టేస్ట్ రాదు. పక్కా కొలతలతో చేస్తేనే దీని రుచి అద్భుతంగా ఉంటుంది. రోటీ, నాన్ లేదా పులావ్ వంటి వాటిల్లోకి బటర్ చికెన్ ను తింటే ఆ రుచిని నాలుక కొన్నేళ్లు మర్చిపోదు. కొన్ని రెస్టారెంట్ల బిజినెస్ కేవలం బటర్ చికెన్ రెసిపి మీద నడుస్తుందని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు. బటర్ చికెన్ ను ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ లో తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.


బటర్ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు 

బోన్ లెస్ చికెన్ 

అల్లంవెల్లుల్లి పేస్ట్ 

పెరుగు 

కారం 

ఉప్పు 

పసుపు 

యాలకలు 

బిర్యానీ ఆకు 

లవంగ మొగ్గ 

నిమ్మరసం 

ఆయిల్ 

బటర్ 

దాల్చిన చెక్క 

పచ్చిమిర్చి 

షాజీరా 

ధనియాల పొడి 

టమాటో 

ఉల్లిపాయ 

జీడిపప్పు 

వెల్లుల్లి రెబ్బలు


బటర్ చికెన్ తయారీ విధానం -


ముందుగా పావు కేజీ బోన్ లెస్ చికెన్ ను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.


-తర్వాత ఇందులో పావు టీ స్పూన్, 1 టీస్పూన్ నిమ్మరసం, 1 టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పెరుగు, పావు టీస్పూన్ కారం, 1 టీస్పూన్ ఉప్పు వేసి మొత్తం చికెన్ ముక్కలకు బాగా పట్టేలా కలిపి మూతపెట్టి డీఫ్రిడ్జ్ లో పావు గంటసేపు పెట్టండి. -తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడిచేసి అందులో చికెన్ ముక్కలు వేసి కలుపుతూ బాగా ఫ్రై చేసి వాటిని తీసుకొని ఓ ప్లేట్ లో పెట్టుకోవాలి


ఇప్పుడు అదే పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల బటర్ వేసి అది కరిగిన తర్వాత అందులో 1 ఇంచు దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, రెండు యాలకలు, నాలుగు లవంగ మొగ్గలు వేసి కొద్దిసేపు ఫ్రై చేసి ఇందులో సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, పొట్టు తీసేసిన 4 వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.


-ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అందులో సన్నగా పొడుగ్గా కట్ చేసి ఉంచి రెండు టమాటో ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసి మూతపెట్టి టమాటోలు మగ్గనివ్వాలి. 


-టమాటోలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దానిని చల్లారనివ్వాలి. -తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని మిక్సీ గిన్నెలో వేసి ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. 


-తర్వాత పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల బటర్ ని వేసి కరిగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ షాజీరా, రెండు పచ్చిమిర్చి చీలికలు, 1 టీస్పూన్ ధనియాల పొడి, 1 టీస్పూన్ కారం వేసి లైట్ గా వేయగిన తర్వాత ఇందులో మిక్సీలో రెడీ చేసిన పేస్ట్ ని వేసి కలపాలి. 


-రెండు నిమిషాల తర్వాత ఇందులో ఫ్రై చేసిన చికెన్ ముక్కలు వేసి కలిపిన తర్వాత ఇందులో అరలీటరు నీళ్లు పోయాలి. రుచికి తగినట్లుగా కావాలనుకుంటే ఉప్పు, కారం వేసుకోవచ్చు. 


-మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడికించి అందులో కొద్దిగా బటర్, పాల మీగడను మిక్సీ గిన్నెలో రెండు మూడు పల్స్ ఇస్తే వచ్చే క్రీమ్ ని, 1 టేబుల్ స్పూన్ కసూరి మెతిని వేసి కలపాలి. అంతే టేస్టీ బటర్ చికెన్ రెడీ.

No comments: